నా సెల్ ఫోన్ సమాచారాన్ని దోచేశారు: బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన నటి రాధా ప్రశాంతి
- లక్ష్మి, ఆమె కుమారుడు చక్రి దొంగిలించారు
- పాన్ కార్డు, పాస్ పోర్టు కూడా వారివద్దే
- కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఇటీవల ఆమె తన కుమారుడు చక్రితో కలిసి ప్రశాంతి నివాసానికి వచ్చింది. చీరల డిజైన్లను చూపిస్తానని వారు చెప్పగా, తన వాట్స్ యాప్ కు పంపాలని ప్రశాంతి కోరింది. ఆ సమయంలో తన ల్యాప్ టాప్ పని చేయడం లేదని చెప్పిన చక్రి, ప్రశాంతి సెల్ ఫోన్ ను తీసుకున్నాడు. ఆపై గంటన్నర తరువాత ఫోన్ తిరిగిచ్చి వెళ్లిపోయాడు. అనంతరం చూసుకుంటే, సెల్ ఫోన్ లోని ముఖ్యమైన ఫొటోలు, విలువైన పత్రాలు, సమాచారం మొత్తం మాయమైంది.
ఆపై చక్రికి, లక్ష్మికి ఫోన్ చేయగా, వారు వస్తామని చెప్పి రాలేదు. మరోసారి ఫోన్ చేస్తే సరైన సమాధానం రాలేదు. అలాగే లక్ష్మి తనకు జీఎస్టీ కార్డు ఇప్పిస్తానని చెప్పి తన పాన్ కార్డు, పాస్ పోర్టు, రూ. 25 వేల నగదు కూడా తీసుకుందని, కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.