ఉద్యమ నాయకుడు సీఎం అయితే జరిగే లబ్ధి ఇదే!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మేడిగడ్డ బ్యారేజ్ లోకి 11టీఎంసీలు లిఫ్ట్ చేశాం
- దీనిద్వారా లక్షన్నర ఎకరాలకు నీటిని అందించొచ్చు
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే రాష్ట్రంలోని బీళ్లన్నీ గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతాయని వ్యాఖ్యానించారు. ఉద్యమ నాయకుడే(కేసీఆర్) ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు ఈ లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.