స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే భయం: దర్శకుడు తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే భయం: దర్శకుడు తేజ

  • స్టార్ హీరోలకి మళ్లీ మళ్లీ చెప్పలేం
  •  డైలాగ్స్ సరిగ్గా చెప్పకపోతే సీన్ చెడిపోతుంది
  •  అందుకే చిన్నవాళ్లతో చిన్న సినిమాలన్న తేజ   
దర్శకుడు తేజ ఎక్కువగా కొత్తవాళ్లతోను .. చిన్న హీరోలతోను సినిమాలు చేస్తుంటారు. స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. అందుకు కారణం ఏమిటనే విషయాన్ని ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు.

"స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే నాకు భయం. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే, అలా కాదు ఇలా చేయమని చెబితే వాళ్లు వింటారో లేదో అనే డౌటు నాది. ముంబైలో అయితే వింటారు .. తెలుగువాళ్లు వింటారా అనే భయం ఉండేది. డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే స్టార్ హీరోలకి మళ్లీ మళ్లీ చెప్పలేం. డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే సీన్ చెడిపోతుంది. సీన్ చెడిపోతే సినిమా పోతుంది. సినిమాపోతే నాకు మళ్లీ అవకాశాలు రావు. అందుకే చిన్నవాళ్లతో చిన్న సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాను" అని చెప్పుకొచ్చారు. 
Teja

More Telugu News