విజయవాడలోని రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి: మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు
- విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
- మంత్రి వెంట నగరపాలక సంస్థ అధికారులు
- సమస్యల పరిష్కారానికి తగు ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలి
ఆర్ అప్పారావు వీధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పనులను, చిన్నపాటి వర్షాలకే జలమయమైన గణపతి రోడ్డును పరిశీలించారు. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రతిరోజు డ్రైన్లు పొంగి రోడ్డుపైకి మురుగు, వర్షపు నీరు చేరుతోందని, దీంతో ఈ ప్రాంత ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయా ప్రాంతాల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.