Sundaram Master: ప్రభుదేవా వంటి డాన్సర్ ఇండియాలోనే లేడు: తండ్రి సుందరం మాస్టర్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు . తమిళ భాషల్లో డాన్స్ మాస్టర్ గా సుందరం మాస్టర్ కి ఎంతో క్రేజ్ వుంది. ఆయన ముగ్గురు తనయుల్లో ప్రభుదేవా .. రాజు సుందరం కొరియోగ్రఫర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో సుందరం మాస్టర్ మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ కొరియోగ్రఫీ వైపు వచ్చాను.

అప్పట్లో సినిమావాళ్లు తమ పిల్లలను సినిమాలవైపు రానిచ్చేవారు కాదు. కొంతమంది తమ పిల్లలను స్టూడియో వైపు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి రోజుల్లోనే నా ముగ్గురు పిల్లలకు డాన్స్ నేర్పించి కొరియోగ్రఫర్స్ గా చేశాను. మా అబ్బాయి ప్రభుదేవా గురించి నేను గర్వంగా చెబుతాను .. ఇండియాలో అలాంటి డాన్సర్ లేడు. సినిమాల్లో ఒక కొరియోగ్రఫర్ గా నేనేం చేశానో తెలియదుగానీ, ప్రభుదేవా మాత్రం అద్భుతాలు చేశాడు. అందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అన్నారు.
Go Back to Shorts
Sundaram Master

More Telugu News