చిరంజీవి రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చేశావ్.. ఇప్పుడు చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావ్!: కేశినేనిపై బుద్ధా వెంకన్న ఆగ్రహం
- టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
- విజయసాయిరెడ్డిపై నేను పోరాడుతున్నా
- ప్రజారాజ్యంలో ఆడిన ఆటలు టీడీపీలో చెల్లవు
వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై ఎవరు పోరాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఏం చేయాలో తెలియక కేశినేని నాని అబద్ధాలు ఆడుతున్నారనీ, ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చేముందు ఆడిన ఆటలు టీడీపీలో చెల్లవని స్పష్టం చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.