సంక్షోభంలో పోరాడేవాడు కావాలి.. నీలా పార్టీని కూల్చేవాడు కాదు!: కేశినేనికి బుద్ధా వెంకన్న కౌంటర్
- బుద్ధా వెంకన్న టార్గెట్ గా కేశినేని ట్వీట్లు
- తిప్పికొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా
- చంద్రబాబు కోసం పోరాడేవాళ్లు కావాలని వ్యాఖ్య
సంక్షోభం సమయంలో పార్టీ కోసం, పార్టీ నాయకుడి కోసం పోరాడేవాడు కావాలని బుద్ధా వెంకన్న తెలిపారు. అంతే తప్ప ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆయన(కేశినేని)లా పార్టీని కూల్చేవాడు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అవకాశవాదులు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం చనిపోయేవరకూ సైనికుడిలా పోరాడేవాడు కావాలని చెప్పారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.