Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ఇప్పుడు చాలా మంది తారలు వెబ్ సీరీస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ కోవలోకి అందాలతార సమంత కూడా చేరనుంది. అమెజాన్ ప్రైమ్ భారీ ఎత్తున నిర్మించే ఓ వెబ్ సీరీస్ కోసం ఈ ముద్దుగుమ్మను అడుగుతున్నట్టు సమాచారం. ఈ భారీ ప్రాజక్టు పట్ల తను కూడా ఆసక్తి చూపుతోందట.
*  'ఈగ' ఫేం సుదీప్ హీరోగా కన్నడలో రూపొందుతున్న 'పహల్వాన్' చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. వారాహి చలన చిత్ర సంస్థ దీనిని అదే పేరుతో తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
*  నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తాజాగా వచ్చిన 'ఓ బేబీ' చిత్రం మంచి విజయం సాధించడంతో దీనిని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సమంత పాత్ర కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.   
Go Back to Shorts
Samantha
Nandini Reddy
Bollywood
Sudip

More Telugu News