జగన్ క్షమాపణ చెబుతారా? లేక రాజీనామా చేస్తారా?: చంద్రబాబు
- నన్ను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా?
- సున్నా వడ్డీపై అన్ని వివరాలు సభ ముందు ఉంచుతాం
- సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారు
ముఖ్యమంత్రి ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను రాజీనామా చేసి వెళ్లిపొమ్మంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా గాడిదలు కాశారా అంటారా? అని మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని... అప్పుడు జగన్ రాజీనామా చేస్తారా? లేక క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు.