పింఛన్ డబ్బు కోసం తండ్రిపై కొడుకు దాడి... చికిత్స పొందుతూ మృతి
- మద్యం తాగి తండ్రిపై దాడి
- కృష్ణా జిల్లా చందర్లపాడులో ఘటన
- ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
ఈనెల 8వ తేదీన ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ కింద అందించిన 2,250 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి అతని రెండో కొడుకు సిలార్‌సాహెబ్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తండ్రిని డబ్బు కోసం అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో తండ్రిపై దాడి చేశాడు. అనంతరం అతని గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
అపస్మారక స్థితికి చేరుకున్న షేక్ మహబూబ్‌సాహెబ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. మృతుడి పెద్ద కుమార్తె మస్తాన్‌బీ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.