ఓ 45 నిమిషాల చెత్త ఆట మమ్మల్ని టోర్నమెంట్ నుంచి గెంటేసింది: కోహ్లీ
- సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్
- ధోనీ రనౌట్ తో పరిస్థితి మారిపోయిందన్న కోహ్లీ
- ఈ ఓటమిని భరించడం కష్టమేనన్న భారత సారథి
కొన్ని కీలక సమయాల్లో న్యూజిలాండ్ చూపించిన తెగువ వారిని గెలుపు తీరాలకు చేర్చిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ పోరులో తమ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, పిచ్ ను బాగా ఉపయోగించుకున్న కివీస్ బౌలర్లు స్వింగ్ తో తమను దెబ్బకొట్టారని అంగీకరించాడు. గత రెండు మ్యాచ్ ల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడని, ధోనీ అతడితో మంచి భాగస్వామ్యం నెలకొల్పినా, చివర్లో ధోనీ రనౌట్ తో పరిస్థితి మారిపోయిందని కోహ్లీ వివరించాడు. జడేజా దూకుడుతో తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడని, కానీ, న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని కోహ్లీ పేర్కొన్నాడు.