Chandrababu: చంద్రబాబుకు ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ వాహనం బోల్తా

  • అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు
  • ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు
  • పెనుకొండ మండలంలో వాహనం బోల్తా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ పోలీసు వాహనం బోల్తా కొట్టింది. చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పర్యటన ముగించుకుని వస్తున్న సందర్భంగా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ రామాంజనేయులు, ఏఆర్ సీసీ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Chandrababu
Escort Vehicle
Accident
Anantapur District
Telugudesam
Telugudesam

More Telugu News