Andhra Pradesh: హోంగార్డును బండబూతులు తిట్టిన వైసీపీ నేత ఆమంచి రాజేంద్ర.. ఆడియో విడుదల చేసిన టీడీపీ!

  • గతంలో తమను దూషించినందుకు ఆగ్రహం
  • ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్న రాజేంద్ర
  • ట్విట్టర్ లో ఆడియోను పోస్ట్ చేసిన టీడీపీ
చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కుమారుడు ఆమంచి రాజేంద్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జిల్లాలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన రాజేంద్ర.. తిట్లదండకం అందుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను తెలుగుదేశం పార్టీ ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును తిడుతున్నట్లు చెబుతున్న ఓ ఆడియోను టీడీపీ నేత నారా లోకేశ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Prakasam District
HOME GUARD
Police
YSRCP
AMANCHI RAJENDRA

More Telugu News