Rituparna Sengupta: బాలీవుడ్ నటి రీతుపర్ణసేన్ గుప్తాకు ఈడీ నోటీసులు

  • హిందీ, బెంగాలీలో పలు సినిమాల్లో నటించిన రీతుపర్ణసేన్ 
  • రోజ్ వేలీ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం
  • 'ఘటోత్కచుడు' చిత్రంలో ప్రేక్షకులను అలరించిన రీతుపర్ణ
ప్రముఖ సినీ నటి రీతుపర్ణసేన్ గుప్తాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రోజ్ వేలీ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. బాలీవుడ్, బెంగాలీతో పాటు టాలీవుడ్ లో కూడా రీతుపర్ణ నటించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'ఘటోత్కచుడు' సినిమాలో నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది.

రోజ్ వేలీ కుంభకోణం పశ్చిమబెంగాల్ ను ఊపేస్తోంది. ఎంతో మంది ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎందరికో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్ జీత్ చటర్జీ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. 
Rituparna Sengupta
ED
Bollywood
Tollywood

More Telugu News