మాంచెస్టర్ అప్ డేట్: వీడని వరుణుడు... మళ్లీ మొదలైంది వాన!

  • దోబూచులాడుతున్న వరుణుడు
  • కనీసం 20 ఓవర్ల ఆటపై అందరి ఆశలు
  • వీలుకాకపోతే మ్యాచ్ రేపు కొనసాగే అవకాశం
మాంచెస్టర్ లో వరుణుడు దోబూచులాడుతున్నాడు. టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ సమరానికి గండికొట్టిన వాన  మరోసారి పలకరించింది. అప్పటికే మైదానంలోకి దిగిన సూపర్ సాపర్ యంత్రాలు మరోసారి తీవ్రంగా శ్రమించినా వరుణుడి జోరు ముందు వాటి పనితనం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటికీ మైదానంలో వర్షపునీరు ఎక్కువగానే ఉంది. ఇక, పూర్తి ఓవర్ల ఆటపై ఆశలు వదులుకున్న అభిమానులు కనీసం 20 ఓవర్ల ఆటైనా సాధ్యపడితే చాలని కోరుకుంటున్నారు. కాగా, వర్షం పడే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఒకవేళ మ్యాచ్ నిర్వహణ ఇవాళ కష్టసాధ్యమైతే రిజర్వ్ డే అయిన రేపు కొనసాగే అవకాశముంది.
Go Back to Shorts
India
New Zealand
Rain
Manchester

More Telugu News