Mahesh Babu: తన పర్సనల్ మేకప్ మ్యాన్ ఫొటో పోస్టు చేసి విషెస్ చెప్పిన మహేశ్ బాబు

  • హ్యాపీ బర్త్ డే పట్టాభి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
  • స్పందించిన అర్ధాంగి, వదిన
  • లక్షల్లో లైకులు
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేశ్ బాబు తన సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత పాతికేళ్లుగా ఒకే మేకప్ మ్యాన్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఆయన పేరు పట్టాభి. తాజాగా, పట్టాభి జన్మదినం సందర్భంగా మహేశ్ బాబు తామిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

"హ్యాపీ బర్త్ డే పట్టాభి. మిమ్మల్ని ఎప్పటికీ ఇష్టపడతాను, మీరంటే చాలా గౌరవం" అంటూ స్పందించారు. మహేశ్ పెట్టిన ఈ పోస్టుపై ఆయన అర్ధాంగి నమ్రత, వదిన శిల్పా శిరోద్కర్ కూడా కామెంట్ చేశారు. హ్యాపీ బర్త్ డే పట్టాభి గారూ అంటూ విషెస్ తెలిపారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. మహేశ్ బాబు పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే 2 లక్షలకు పైగా లైకులతో హోరెత్తించారు.
Mahesh Babu
Tollywood
Makeup Man
Pattabhi

More Telugu News