prakasam: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు

  • హరిబాబుకు బీజేపీ కండువా కప్పిన జేపీ నడ్డా  
  • బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది
  • రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్న ఈదర
బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. హరిబాబును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన నడ్డా, ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం, విలేకరులతో ఈదర హరిబాబు మాట్లాడుతూ, బీజేపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాగా, ఈదర హరిబాబుతో పాటు ఆయన కుమారుడు భరత్ కూడా బీజేపీలో చేరారు.

ఇదిలా ఉండగా, గతంలో ఈదర హరిబాబు  టీడీపీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో టీడీపీతో ఆయన విభేదించారు. వైసీపీ మద్దతుతో చైర్మన్ పదవిని ఆయన దక్కించుకున్నారు. 
prakasam
ex
mla
Eedara hairbabu
Telugudesam

More Telugu News