amaravathi: అమరావతి నిర్మాణానికి ఏపీకి నిధులు కావాలి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో చర్చ 
  • పోలవరం ప్రాజెక్టుకు నిధులు రావాల్సి ఉంది
  • ప్రధాని, మంత్రుల నోటి వెంట ‘హోదా’ లేదన్న మాటే వస్తోంది
రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీకి నిధులు కావాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఏపీకి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రావాల్సి ఉందని, ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సహాయనిధి రావాలని, వెనుకబడిన జిల్లాలకు సహాయనిధిపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని, లోటు బడ్జెట్ విషయంలోనూ తప్పుడు లెక్కలు ఉన్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను వైసీపీ ఎలా సాధిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ప్రధాని, హోం మంత్రి, ఆర్థిక మంత్రుల నోటి వెంట ఏపీకి ‘హోదా’ లేదనే మాటలు వస్తున్నాయని విమర్శించారు. అదే నిజమైతే వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలను ఎలా ఒప్పిస్తారో చూడాలని అన్నారు. 
amaravathi
Telugudesam
mp
rammohan naidu
loksabha

More Telugu News