కీలక సమరంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్

  • బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
  • మాంచెస్టర్ లో భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్
  • కుల్దీప్ స్థానంలో చాహల్
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు మెరుగైన విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గిన వెంటనే బ్యాటింగ్ అంటూ ఉత్సాహంగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి రాగా, న్యూజిలాండ్ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడిపోయిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ చాలా ఫ్రెష్ గా ఉందని, టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగే ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
Go Back to Shorts
India
New Zealand
World Cup
Semis
Toss

More Telugu News