మందుబాబులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత్వం?
- మద్యం అమ్మకాల సమయాన్ని కుదించే యోచనలో ప్రభుత్వం
- ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు
- మద్యం అమ్మకాలు భారీగా తగ్గుతాయనేది ప్రభుత్వ ఆలోచన
వాస్తవానికి సాయంత్రం 6 గంటల తర్వాతే మద్యం అమ్మకాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఎవరైనా సరే... రాత్రి వేళల్లోనే ఎక్కువగా మద్యం తాగుతారు. రాత్రి పూట మద్యం షాపులు కిక్కిరిసిపోతాయి. దీంతో, 6 గంటలకు మద్యం షాపులను బంద్ చేస్తే... మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబరు నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, పలు ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే... మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చినట్టే.