ఈ విషయాన్ని కేన్ విలియమ్ సన్ కు గుర్తుచేస్తా: విరాట్ కోహ్లీ

  • 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ను ప్రస్తావించిన కోహ్లీ
  • అప్పుడు, విలియమన్ సన్, నేను కెప్టెన్ లుగా ఉన్నాం
  • ఇప్పుడూ కెప్టెన్లగానే రేపటి మ్యాచ్ లో తలపడనున్నాం
ప్రపంచకప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య రేపు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కోహ్లీ ప్రస్తావించాడు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయని, అప్పుడు, కివీస్ జట్టుకు కేన్ విలియమ్ సన్, టీమిండియాకు తాను కెప్టెన్ లు గా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మళ్లీ, రేపటి మ్యాచ్ లో తాము పోటీపడుతున్నామని చెప్పిన కోహ్లీ, ఈ విషయాన్ని విలియన్ సన్ కు గుర్తుచేస్తానని అన్నాడు. పదకొండేళ్ల తర్వాత సీనియర్ వరల్డ్ కప్ లో తామిద్దరం నాయకత్వం వహిస్తుండటం సంతోషంగా ఉందని అన్నాడు.
Go Back to Shorts
World cup
Team India
kohli
Kiwis
Kane william

More Telugu News