కాగజ్ నగర్ ఘటనలో మరో ట్విస్ట్.. ఎఫ్ఆర్వో అనిత, ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు!
- ఫారెస్ట్ సిబ్బందిపై కోనేరు కృష్ణ అనుచరుల దాడి
- తాజాగా పోలీసులకు సార్సాల గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదు
- కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆవేదన
తాజాగా ఎఫ్ఆర్వో అనిత, మరో 15 మంది అధికారులపై ఎస్టీ,ఎస్టీ వేధింపుల కేసు నమోదయింది. ఎఫ్ఆర్వో అనిత, ఫారెస్ట్ సిబ్బంది తనను కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామనీ, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.