సోషల్ మీడియాలో కొడుకు పెడుతున్న కష్టాలు చెప్పుకుని బోరుమన్న వృద్ధ దంపతులు.. సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్
- కోడలితో కలిసి కొడుకు అష్టకష్టాలు పెడుతున్నాడంటూ కన్నీళ్లు
- కష్టపడి సంపాదించిన ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన
- ఇల్లు ఖాళీ చేయాలంటూ కొడుకు-కోడలికి అధికారుల ఆదేశం
తాము ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బతికి ఉండాలో, చావాలో కూడా అర్థం కావడం లేదంటూ గద్దగ స్వరంతో చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తమకు సాయం అందించాలని, ఈ మేరకు అతనికి ఫిర్యాదు కూడా చేశానని ఇంద్రజిత్ తెలిపారు. కుమారుడు, కోడలి కంబంధ హస్తాల నుంచి తమను రక్షించి తమ స్వార్జితమైన ఇంట్లో తాము ఉండేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అర్థించారు. కొడుకు కోడలు కలిసి తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇప్పుడు తమకు చావే శరణ్యమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇదో కుటుంబ సమస్య అని దీనిని పరిష్కరించినట్టు తెలిపారు. ఆ ఇంటిని పది రోజుల్లోగా ఖాళీ చేయాలని వృద్ధ దంపతుల కుమారుడు, కోడలిని ఆదేశించినట్టు తెలిపారు. అంతేకాదు, ఇంటిని ఖాళీ చేస్తామని లిఖితపూర్వకంగా వారు హామీ ఇచ్చారని డీఎం తెలిపారు.