ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. సులవేసి, నార్త్ మాలుకు ద్వీపాల మధ్య మొలుక్కా సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1 గా నమోదైంది. దీంతో అధికారులు 8 నగరాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

భూకంపం కారణంగా టెర్నెటే నగరంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. నగరంలోని కొన్ని ఆసుపత్రులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రుల్లోని రోగులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.
Go Back to Shorts
tsunami
Indonesia
earthquake

More Telugu News