వార్తలు చదువుతుండగా భూకంపం రావడంతో టేబుల్ కింద దాక్కున్న టీవీ న్యూస్ రీడర్

  • అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం
  • 7.1 తీవ్రతతో భూకంపం
  • సీబీఎస్ స్టూడియోలో భయోత్పాతం
 అమెరికాను ఇవాళ భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత దాదాపు 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి సౌత్ కాలిఫోర్నియా కంపించిపోయింది. కాగా, భూకంపం సంభవించిన సమయంలో సీబీఎస్ న్యూస్ చానల్ స్టూడియోలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఓ వైపు న్యూస్ లైవ్ లో ఓ మేల్ ప్రజెంటర్, మరో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్నారు. ఇంతలో చిన్నగా మొదలైన ప్రకంపనలు ఒక్కసారిగా తీవ్రం కావడంతో ఆ లేడీ న్యూస్ రీడర్ లో భయం తారస్థాయికి చేరింది. వెంటనే వార్తలు చదవడం ఆపేసి తన డెస్క్ టేబుల్ కింద దాక్కుంది. ఇదంతా లైవ్ లో కోట్లాది మంది వీక్షకులు చూశారు. అమెరికాలో భూకంపం ప్రజలను ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే!

Go Back to Shorts
USA
Earthquake
CBS
News Reader

More Telugu News