గుంటూరులో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడిచేసిన వైసీపీ శ్రేణులు!
- మాచవరం మండలంలోని తురకపాలెంలో ఘటన
- అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించి చెలరేగిన గొడవ
- అల్లావుద్దీన్ అనే టీడీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు
దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వైసీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్త షేక్ అల్లావుద్దీన్ పై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి తీవ్రగాయం అయింది. దీంతో ఆ గాయంతోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన అల్లావుద్దీన్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన అనంతరం పరారయ్యారు. దీంతో కేసు నమోదుచేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.