ఇంకా మీరు నిజాయతీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి
- విత్తనాల కోసం రూ.380 కోట్లివ్వాలని అధికారులు కోరారు
- అయితే ఆ నిధులను బాబు ఎన్నికల ప్రలోభాలకు మళ్లించారు
- పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో రూ.30 వేల కోట్లు మాయం చేశారు
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ’ అని ట్వీట్ చేశారు.