సెమీస్ చేరిన భారత జట్టుకు కేటీఆర్ అభినందనలు

  • బంగ్లాదేశ్‌పై భారత్ విజయం తర్వాత కేటీఆర్ ట్వీట్
  • టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో భారత్
  • రోహిత్ అద్భుత సెంచరీ
ప్రపంచకప్‌లో సెమీస్‌‌కు చేరిన కోహ్లీసేనకు టీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్‌ సాధించేందుకు మరో రెండు విజయాల దూరంలో భారత జట్టు నిలిచిందని ట్వీట్ చేశారు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 314 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే ఆలౌటై సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
Go Back to Shorts
Team India
KTR
TRS
icc world cup

More Telugu News