ఇక నేలపైనే ట్రాఫిక్ సిగ్నల్స్.. కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు
- రోడ్డుపైనే ఏర్పాటు చేసిన సిగ్నళ్లు
- వాహనదారులకు సరికొత్త అనుభూతి
- వాహనదారుల నుంచి జీబ్రాక్రాసింగ్‌లకు విముక్తి
ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే నగరమంతా విస్తరించనున్నారు. ఈ సిగ్నళ్ల ఏర్పాటు వల్ల పాదచారులు రెడ్‌లైట్ దాటి ముందుకెళ్లే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే, వీటి ఏర్పాటు వల్ల జీబ్రాక్రాసింగ్‌లకు కొంత విముక్తి లభించనుంది. పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగా వాటిని ఉపయోగించుకుని రోడ్డు దాటవచ్చు.