bellamkonda: పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ రాజ్ పుత్

షార్ట్స్‌లో చూడండి
'ఆర్ ఎక్స్ 100' సినిమా హిట్ తరువాత పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తనకి నచ్చిన పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఆమె దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లోను అవకాశాన్ని దక్కించుకుంది.

వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. 1980- 90 లలో స్టూవర్ట్ పురం గజదొంగగా 'టైగర్ నాగేశ్వరరావు' ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఆయన జీవిత చరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో పాయల్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అక్క పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుందనే టాక్ వుంది. అందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
bellamkonda
payal

More Telugu News