రామ్ ఆశలన్నీ 'ఇస్మార్ట్ శంకర్'పైనే
- పోస్టు ప్రొడక్షన్ పనుల్లో 'ఇస్మార్ట్ శంకర్'
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఈ నెల 18వ తేదీన విడుదల
ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ కు.. మణిశర్మ స్వరకల్పనలో వదిలిన నాలుగు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో రామ్ వున్నాడు. ఆయన ఆశ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. మాస్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే.