'బాహుబలి' రీమేక్... హక్కులు తీసుకున్న గుజరాత్ నిర్మాతలు!

  • ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన 'బాహుబలి'
  • బిజినెస్ వర్కవుట్ కాదంటున్న నిపుణులు
  • తగ్గేది లేదంటున్న నితిన్ జానీ, తరుణ్ జానీ
భారత చలనచిత్ర చరిత్రలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' ఎంత సంచలనం సృష్టించిందో, ఎన్ని రికార్డులను నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క తెలుగులోనే కాదు. ఉత్తరాదిన కూడా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని, ఆల్ టైమ్ బిగ్గెస్ హిట్ ను సాధించింది. అటువంటి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న సాహసం చేసేందుకు రంగంలోకి దిగారు గుజరాతీ నిర్మాతలు. ఇప్పటికే రీమేక్ హక్కులను తీసుకున్న నితిన్ జానీ, తరుణ్ జానీ, కాస్తంత తక్కువ బడ్జెట్ లోనైనా, దీన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు టెలివిజన్ లో ప్రసారమైన ఈ సినిమాను మరోసారి తీస్తే, బిజినెస్ వర్కవుట్ అవుతుందా అన్న అనుమానాలు ఉన్నా, తాము మాత్రం తగ్గేది లేదంటున్నారు ఈ సోదర ద్వయం. ఇక మరికొందరు అసలు ఈ ఆలోచనే తుగ్లక్ చర్యని కామెంట్లు కూడా చేస్తున్నారు.
Go Back to Shorts
Bahubali
Remake
Gujarati
Tarun Jani
Nitin Jani

More Telugu News