ఇక్కడ మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి... చంద్రబాబు వద్దకు అనంత నేతలు!
- బీజేపీలో చేరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
- నాయకుడు లేక తెలుగు తమ్ముళ్ల దిగాలు
- కొత్త నేత ఎంపిక త్వరలోనే
నియోజక వర్గంలో పార్టీని తిరిగి బలోపేతం చేసే సత్తా ఉన్న నాయకుడు తమకు కావాలంటూ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు వ్యాఖ్యానించగా, విషయాన్ని చంద్రబాబుకు చేరవేసి, మరో నేతను ఎంపిక చేయాలని కోరనున్నట్టు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్ధసారథి వెల్లడించారు. ఇన్ చార్జ్ ఎంపికపై అభిప్రాయాలను సేకరించి, ఆపై చంద్రబాబు వద్దకు వెళ్లి, పార్టీ ఇన్ చార్జ్ ని ప్రకటిస్తామని ఆయన అన్నారు.