తెలంగాణలో ఆటవిక పాలన: విజయశాంతి

  • మహిళా అధికారులకే రక్షణ లేదు
  • సామాన్యుల పరిస్థితి ఏంటి?
  • ఫేస్ బుక్ లో విజయశాంతి
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. మహిళా ఉన్నతాధికారులకే రక్షణ లేకుండా పోయిందని, అసలు పాలనే సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు. కోనేరు కృష్ణ దాడి చేసి గాయపరిచిన ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితను ఫోన్ లో పరామర్శించిన విజయశాంతి, ఆపై తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

"రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుంది.. మహిళ ఉన్నతాధికారులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు పాలన ఉందా? ముఖ్యమంత్రి ఆడంబరాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలు తున్నారు" అని విమర్శలు గుప్పించారు.

Go Back to Shorts
Vijayasanthi
Telangana
Facebook

More Telugu News