England: హమ్మయ్య! తొలి వికెట్ పడింది... బ్రేకిచ్చిన కుల్దీప్ యాదవ్

షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఎట్టకేలకు 160 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ పడింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు బ్రేకిచ్చాడు. యాదవ్ విసిరిన బంతికి ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ లాంగాన్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాయ్ 66 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 163 పరుగులు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 90, రూట్ 2 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
England
India

More Telugu News