vizag: త్వరలో టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది: మంత్రి అవంతి శ్రీనివాస్ జోస్యం

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో టీడీపీపై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. త్వరలో టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. విశాఖపట్టణంలోని మద్దిలపాలెంలో వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో వైసీపీ ఓటమిపై సమీక్ష నిర్వహిస్తామని, పార్టీ కోసం పని చేసిన వారికి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఏ పార్టీకి అయినా కార్యకర్తలే రథసారథులని, కార్యకర్తలు లేనిదే పార్టీ మనుగడ లేదని అన్నారు. కార్యకర్తలు అభద్రతా భావానికి గురికావొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.  
Go Back to Shorts
vizag
minister
avanthi

More Telugu News