తలో చెయ్యి వేసినా శ్రీలంక స్కోరు 203 పరుగులే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తలో చెయ్యి వేసినా శ్రీలంక స్కోరు 203 పరుగులే!

  • దక్షిణాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం
  • రాణించిన సఫారీ బౌలర్లు
  • భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయిన లంక బ్యాట్స్ మెన్
చెస్టర్ లీ స్ట్రీట్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాట్స్ మెన్ భారీస్కోర్లు సాధించడంలో విఫలం కావడంతో లంక కేవలం ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కుశాల్ పెరెరా (30), ఫెర్నాండో (30), కుశాల్ మెండిస్ (23), డిసిల్వా (24), జీవన్ మెండిస్ (18), తిసర పెరెరా (21) ఫర్వాలేదనిపించేలా ఆడినా ప్రయోజనంలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న దశలో అవుట్ కావడంతో లంక భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యాయి. ఓవైపు దక్షిణాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో పరీక్ష పెట్టడం కూడా లంకేయులను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా, ప్రిటోరియస్ (3 వికెట్లు), మోరిస్ (3 వికెట్లు), రబాడా (2 వికెట్లు) బాగా బౌలింగ్ చేశారు.
Sri Lanka
South Africa

More Telugu News