'రణరంగం' టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం
- సుధీర్ వర్మ నుంచి 'రణరంగం'
- డిఫరెంట్ లుక్స్ తో శర్వానంద్
- నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్
రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి టీజర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రఫ్ లుక్ తో శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచె మనసు' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన వున్నాడు. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అంతే. వాళ్లకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.