రేపే 'ఓ బేబీ' ప్రీ రిలీజ్ ఈవెంట్
- సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ'
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
- అందరిలో పెరుగుతోన్న ఆసక్తి
ఇంతకు ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాగా సమంత చేసిన 'యూ టర్న్'కి మంచి ఆదరణ లభించింది. దాంతో సహజంగానే 'ఓ బేబీ'పై అందరిలో ఆసక్తి వుంది. ఆల్రెడీ ఈ కథ ఏడు భాషల్లో విజయాన్ని సాధించిందని సమంత చెప్పడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను 'ఓ బేబీ' ఎంతవరకూ అందుకుంటుందో చూడాలిమరి.