RBI: నాణేలన్నీ చలామణిలో ఉన్నాయి.. తప్పకుండా తీసుకోవాల్సిందే: రిజర్వు బ్యాంకు

షార్ట్స్‌లో చూడండి
50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని భారతీయ రిజర్వుబ్యాంకు మరోమారు స్పష్టం చేసింది.  రూపాలు, డిజైన్లలో తేడా ఉన్నా నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని, ప్రజలు, దుకాణదారులు వాటిని తీసుకోవాలని కోరింది.

నాణేలు చెల్లుబాటు కావడం లేదన్న ఉద్దేశంతో ఈ మధ్య వీటిని తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. చివరికి బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చిన ఆర్‌బీఐ మరోమారు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. నాణేలను ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తల్లో నిజం లేదని, అందరూ తప్పకుండా వీటిని తీసుకోవాలని సూచించింది. బ్యాంకులు కూడా లావాదేవీల సమయంలో నాణేలను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
RBI
Banks
Coins

More Telugu News