కృష్ణతో అత్యధిక సినిమాల్లో నటించిన విజయ నిర్మల .. తిరుపతిలో వివాహం
- కృష్ణతో కలిసి 47 సినిమాల్లో నటించిన విజయ నిర్మల
- దర్శకురాలిగా ‘నేరము-శిక్ష’ చివరి సినిమా
- తొలి సినిమా ‘రంగులరాట్నం’కి నంది అవార్డు
మొత్తంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల 2009లో కృష్ణ హీరోగా ‘నేరము-శిక్ష’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా అదే ఆమె చివరి చిత్రం. హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘రంగులరాట్నం’తోనే ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాకు ఆమె నంది అవార్డు అందుకున్నారు. అలాగే, సినీ రంగంలోని అత్యున్నత పురుస్కారమైన రఘుపతి వెంకయ్య అవార్డును కూడా విజయనిర్మల అందుకున్నారు.