వైఎస్సార్ అడుగుజాడల్లోనే.. ‘రచ్చబండ’ను మళ్లీ ప్రారంభించనున్న సీఎం జగన్!
- ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించిన జగన్
- కలెక్టర్లు గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశం
- అధికారులు ఆసుపత్రులు, స్కూళ్లలో నిద్రించాలని సూచన
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపడతానని సీఎం జగన్ ప్రకటించారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం సూచించారు. రైతులు, విద్య, వైద్యం రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జగన్ స్పష్టం చేశారు.