fadnavis: రూ. 7 లక్షల వాటర్ బిల్లు బకాయిపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం

  • 2001 నుంచి నల్లా బిల్లు చెల్లించని ఫడ్నవిస్
  • బిల్లు ఎగవేతదారుల్లో 18 మంది వీవీఐపీలు
  • స.హ. చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వాస్తవం

గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఉంటున్న అధికారిక నివాసం నల్లా బిల్లు కట్టడంలేదట. దీంతో, పేరుకుపోయిన బిల్లులు ఏకంగా రూ. 7 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఎగవేతదారుల జాబితాలో సీఎం బంగ్లాను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేర్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఫడ్నవిస్ అధికారిక బంగ్లా ఉంది. 2001 నుంచి ఆ ఇంటికి నీటి బిల్లును చెల్లించడం లేదు. ప్రస్తుతం పెండింగ్ బిల్లు రూ. 7,44,981కి చేరుకుంది.

నల్లా బిల్లు ఎగవేతదారుల్లో ఫడ్నవిస్ తో పాటు మహారాష్ట్ర కీలక నేతలు పంకజా ముండే, రాందాస్ కదమ్, సుధీర్ ముంతివార్ లాంటి వారి నివాసాలు 18 ఉన్నాయి. వీవీఐపీల పెండింగ్ బిల్లులు రూ. 8 కోట్లకు పైగానే ఉన్నాయట. మరి కొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో... ఈ అంశం రాజకీయ రంగును పులుముకుంది. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి.

More Telugu News