Telugudesam: మా పార్టీలో చేరినంత మాత్రాన సుజనా చౌదరి ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు: బీజేపీ నేత మురళీధరరావు

  • పార్టీని బలోపేతం చేసుకోవడానికే టీడీపీ ఎంపీలను చేర్చుకున్నాం
  • మెజార్టీ ఎంపీలు విలీనమవడం అనైతికం కాదు
  • బీజేపీలో టీడీపీ విలీన ప్రక్రియ పూర్తి
బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని ఉద్దేశించి బీజేపీ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరినంత మాత్రాన సుజనా చౌదరి ఈడీ, ఐటీల కేసుల నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడానికే టీడీపీ ఎంపీలను చేర్చుకున్నామని చెప్పారు. మెజార్టీ ఎంపీలు విలీనమవడం అనైతికం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీలో టీడీపీ పక్షం విలీన ప్రక్రియ పూర్తయింది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులను బీజేపీ సభ్యులుగా రాజ్యసభ వెబ్ సైట్లో ప్రకటించారు.
Telugudesam
mp
muralidhar rao
bjp

More Telugu News