Telangana: ప్రొ.జయశంకర్ వర్ధంతి.. బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్ముడన్న హరీశ్ రావు!

  • జయశంకర్ ను నివాళులు అర్పించిన నేత
  • తెలంగాణ సాధనకు పోరుబాటను చూపారని ప్రశంస
  • ఆయన స్ఫూర్తిని గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామని వ్యాఖ్య
ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరుబాట చూపిన సిద్ధాంతకర్త అని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. ఆయన బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్ముడని కితాబిచ్చారు. ఆయన స్ఫూర్తిని చెదరకుండా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామని తెలిపారు. ఈరోజు ప్రొ.జయశంకర్ వర్ధంతి సందర్భంగా హరీశ్ రావు ట్విట్టర్ లో స్పందిస్తూ..

‘తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త
బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్మ
నీ స్పూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నాం..
జయహో జయశంకర్ సార్..
పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్!!!
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అశ్రునివాళులు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జయశంకర్ కు నివాళులు అర్పించిన ఫొటోను హరీశ్ పోస్ట్ చేశారు.
Telangana
TRS
Harish Rao
prof jaishankar

More Telugu News