Chandrababu: అమరావతికి చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు... సాయంత్రం చంద్రబాబు నివాసంలో టెలీకాన్ఫరెన్స్

  • ఎంపీలు పార్టీని వీడడంపై చర్చించే అవకాశం
  • విదేశీ యాత్రలో ఉన్న చంద్రబాబు
  • నష్టనివారణకు చంద్రబాబు యత్నాలు!
ఒక్కసారిగా నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం టీడీపీని కుదిపేసింది. తాను లేని సమయంలో పార్టీ నుంచి కీలకనేతలు బయటికి వెళ్లిపోవడం చంద్రబాబును ఆందోళనకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మరింత సంక్షోభంలో పడకుండా ఉండేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ ముఖ్యనేతలంతా ఈ సాయంత్రంలోగా అమరావతిలోని తన నివాసానికి చేరుకోవాల్సిందిగా ఆదేశించారు. విదేశీ యాత్రలో ఉన్న చంద్రబాబు వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నాయకులు అమరావతి చేరుకుంటున్నారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపైనా, కాకినాడలో కాపునేతల సమావేశంపైనా చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు.
Chandrababu
Telugudesam

More Telugu News