వ్యవసాయ పైపులు దొంగలించారట.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు!
- పోలీసులకు రైతు సత్యనారాయణ ఫిర్యాదు
- తాము చందాలు వేసుకుని పైపులు తెచ్చామని వ్యాఖ్య
- కానీ చింతమనేని అర్ధరాత్రి తీసుకెళ్లిపోయారని ఆరోపణ
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న అక్కసుతో చింతమనేని ఈ పైపులను రాత్రికిరాత్రి తొలగించి తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం చందాలు వేసుకుని ఈ పైప్ లైన్లను ఏర్పాటు చేసుకున్నామని వాపోయారు. ఈ ఘటనలో చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రైతుల ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేనిపై సెక్షన్ 420, 384, 431 రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ పై ఏకంగా 17,459 ఓట్లతో ఘనవిజయం సాధించారు.