విమానంలో కుదుపులు.. కిందపడిన ప్రయాణికులు.. భయంతో కేకలు
- ప్రిస్టినా నుంచి బెసెల్ వెళ్తున్న విమానం
- ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు ఘటన
- భయంతో ప్రయాణికుల హాహాకారాలు
డ్రింక్స్ కార్ట్ ఎగిరి విమానం సీలింగుకి తగలడంతో అందులో ఉన్న వేడి పానీయాలు ప్రయాణికులపై చెల్లాచెదురుగా పడి చురుక్కుమనిపించాయి. విమానానికి ఏమైందో? ఏం జరగుతోందో? తెలియక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో కిందపడిన పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. విమానం బెసెల్లో క్షేమంగా ల్యాండయ్యాక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు ఈ ఘటన జరిగిందని, కారణం తెలియరాలేదని అధికారులు తెలిపారు.