నిర్మాతగా మారుతోన్న కాజల్ ... దర్శకుడిగా తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతగా మారుతోన్న కాజల్ ... దర్శకుడిగా తేజ

  • తెలుగులో స్టార్ హీరోయిన్ గా కాజల్
  • తేజ పట్ల కాజల్ కృతజ్ఞత
  •  త్వరలో తేజతో కలిసి సెట్స్ పైకి 
తెలుగులో నాని వంటి హీరోలు నిర్మాతలుగాను ప్రయోగాలు చేస్తున్నారు. చిన్న సినిమాలతో నిర్మాతలుగా మారిపోయి, విజయాలను అందుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా తన జోరును కొనసాగిస్తోన్న కాజల్ కూడా నిర్మాతగా మారడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో ఆమె నిర్మించనున్న తొలి చిత్రానికి తేజ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. తెలుగు తెరకి కాజల్ ను తేజ పరిచయం చేశాడు. ఆ కృతజ్ఞతతో ఆయన దర్శకత్వంలోనే తొలి సినిమాను నిర్మించాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందని అంటున్నారు. కాజల్ ప్రధాన పాత్రధారిగానే ఈ కథ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇటీవల 'సీత' వచ్చిన సంగతి తెలిసిందే. 
kajal
teja

More Telugu News