అవుటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఎక్కేసి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు
- హైదరాబాద్ నుంచి అత్తిలికి కారులో ప్రయాణం
- మృతుడు-క్షతగాత్రులు ఒకే గ్రామానికి చెందిన వారు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
శంషాబాద్ పరిధిలోని హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కేసింది. అదే సమయంలో అత్తిలి గ్రామం నుంచే హైదరాబాద్ వస్తున్న బాల వెంకటసుబ్రహ్మణ్యం (66) కారును ఇది ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాలవెంకట సుబ్రహ్మణ్యం, విశ్వంత్, నారాయణ, కృష్ణలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలవెంకట సుబ్రహ్మణ్యం మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి, గాయాలపాలైన వారు ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.